calender_icon.png 22 November, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఎంఐఎంఎస్ లో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించిన షీ టీం అధికారులు

22-11-2025 06:48:14 PM

టి కృష్ణ ప్రసాద్ ఏసిపి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ సేఫ్టీ వింగ్..

మేడ్చల్ అర్బన్ (విజయక్రాంతి): తమపై అత్యాచారాలు వేధింపులు హింసకు పాల్పడటం జరుగుతుంటే మౌనంగా భరించవద్దని అధికారులు(ఎంఐఎంఎస్) మెడిసిటీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని ఎసిపి టి కృష్ణ ప్రసాద్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ సైబరాబాద్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిసిటీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మహిళల భద్రతపై షీ టీం అధికారులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. మహిళల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ సేఫ్టీవింగ్ అధికారులు శనివారం మెడిసిటీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు.

మహిళలు పిల్లలకు సంబంధించిన భద్రత చట్టాలు ఈవ్ టీజింగ్ తో పాటు వేధింపులు వెంట పడడం వంటి కార్యక్రమాలను నివారించడం హ్యూమన్ ట్రాఫికింగ్,సైబర్ క్రైమ్,చిన్నారుల హింస, బాల్యవివాహాల వంటి వాటిపై అధికారులు ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సవివరంగా తెలియజేసినట్లు ఆయన అన్నారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీవింగ్ అధికారి వై హనుమాన్ గౌడ్ మాట్లాడుతూ ఎవరైనా మహిళలు తాము చదువుకోనే ప్రదేశాలలో కానీ పనిచేసే కార్యాలయాలలో కానీ అభద్రత వేధింపులు లేదా అసభ్యకరమైన అవహేళనకు గురైన పోలీసులు ముఖ్యంగా ఈ అంశాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీటీం అధికారులను ఎలా సంప్రదించాలనే వివరాలను మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షీ టీం సబ్ ఇన్స్పెక్టర్ అనిత.మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి.వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శైలేంద్ర లతో పాటు మెడికల్ విద్యార్థినిలు.మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.