క్రమశిక్షణ తప్పినందుకే కవిత సస్పెండ్
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్, సెప్టెంబర్ 2 : పార్టీలో క్రమశిక్షణ తప్పినందునే ఎమ్మె ల్సీ కవితను పార్టీ నుండి సస్పెం డ్ చేయడం జరిగిందని బీఆర్‌ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆమె మెదక్లో విలేకరులతో మాట్లాడుతూ అంతర్గ తంగా చర్చించాల్సిన విషయాలను, బహిరంగంగా లేఖ రూపంలో కేసీఆర్ కు అందజేసిన ఎమ్మెల్సీ కవిత అప్పటి నుంచి ఇప్పటి వరకూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారని, క్రమశిక్షణ తప్పారని అన్నారు.
అందుకే అధినేత కేసీఆర్ తన బిడ్డ అని కూడా చూడకుండా పార్టీ క్రమశిక్షణ తప్పిన ఆమెను సస్పెండ్ చేశారని, దీనిని అందరం స్వాగతిస్తున్నామని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని కేసీఆర్ సందేశాన్ని పంపించారని అన్నారు.
25 సంవత్సరాలుగా పార్టీని ఏర్పాటు చేసి, పోరాటం చేసి, గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంచి, పార్టీ శ్రేణులందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న కేసీఆర్ లక్ష్యాలను సాధించేందుకు అందరం అండగా నిలుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లిఖార్జున్గౌడ్, మాజీ కౌన్సిలర్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






