ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విస్తృత పర్యటన
సత్తుపల్లి. మే. 7.(విజయక్రాంతి): కల్లూరు, తల్లాడ మరియు సత్తుపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పర్యటించారు. సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం నియోజకవర్గంలోని పలు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు.
ఆధ్యాత్మిక, అభివృద్ధి మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. కల్లూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం సమీపంలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ చర్చి 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి సంఘ పెద్దలు మరియు యువతతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లాడ మండలం, గంగాదేవిపాడు సొసైటీ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు సాగు పనులను సులభతరం చేసే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఆమె ప్రారంభించారు. తల్లాడ మండలం నూతన్ కల్ గ్రామంలో ఐదుగురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సత్తుపల్లి పట్టణం, కృషి బైపాస్ రోడ్డులో సీనియర్ నాయకులు ఇమ్మనేని ప్రసాద్ రావు కుమారుడి వివాహ వేడుకకు ఎమ్మెల్యే హాజరయ్యారు. పెళ్లి కుమారుడిని ఆశీర్వదించిన వారిలో ఎమ్మెల్యే తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కూడా ఉన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.






