25 August, 2026 | 2:57 AM

దైవభక్తిని మరోమారు చాటిన ఎమ్మెల్యే జీఎంఆర్

25-08-2026 01:55 AM

దేవాలయం నిర్మాణానికి రూ.12 లక్షల భారీ విరాళం

జిన్నారం, ఆగస్టు 24 : ఒక వైపు ప్రజాసేవలో, మరో వైపు భక్తి సేవలో తనదైన ముద్రను చాటుతున్నారు. సొంత నిధులతో గుడులు, మసీదులు, చర్చిలు నిర్మిస్తూ ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందిస్తున్నారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మాల సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి 12 లక్షల రూపాయల భారీ విరాళం అందించి తన దైవభక్తిని మరోమారు చాటుకున్నారు. 

30న నిర్వహించ తలపెట్టిన ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా భక్తి ప్రపత్తులతో నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవభక్తి,  ఆధ్యాత్మికతతో పాటు ప్రజాసేవను తన బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.