18 March, 2026 | 9:17 AM

ఎల్లమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్

18-03-2026 12:00 AM

జిన్నారం/అమీన్ పూర్, మార్చి 17 : గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజిపల్లి గ్రామం లో మంగళవారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం, జాతర మహోత్సవంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సం పూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గడ్డ పోతారం మున్సిపల్ చైర్మన్ గద్దె సుష్మా, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, అమీన్పూర్ మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగా రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు బాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, నరసింహ, గ్రామ పుర ప్రముఖులు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.