calender_icon.png 30 September, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

30-09-2025 08:53:29 PM

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..

చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగా అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ గ్రామంలో ఏర్పాటుచేసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడబిడ్డలతో కలిసి ఆడి పాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకున్నారన్నారు.

ఎంగిలి పూలతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో శోభాయమానంగా ముగిసిన ఈ తొమ్మిది రోజులు ఆడపడుచుల ఆనందాల ఉత్సవమన్నారు. తల్లి గౌరమ్మను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే ఈ పండుగలో భాగంగా మహిళలు ఆరాటంగా పూలను సేకరించి, వాటిని అందంగా అలంకరించి ఆడటం మన సంస్కృతికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీ కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.