calender_icon.png 1 October, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పువ్వులను పూజించే చరిత్ర తెలంగాణది: మాజీ ఎమ్మెల్యే రోహిత్

30-09-2025 10:48:50 PM

తాండూరు (విజయక్రాంతి): ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులను పూజించే పండగ కేవలం తెలంగాణలోనే ఉందని వికారాబాద్ జిల్లా మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. నేడు పట్టణంలోని రాయపూర్ ప్రాంతంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని మహిళ సోదరీమణులతో ఆట పాట పాడారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని దుర్గామాతను వేడుకున్నట్లు తెలిపారు. ఇంకా ఈ బతుకమ్మ సంబరాల్లో డాక్టర్ సంపత్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, నరకుల నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.