calender_icon.png 1 October, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధి నిర్వహణలో అందరూ బాగా కష్టపడి పని చేయాలి

30-09-2025 11:00:30 PM

ఎస్పీ యోగేష్ గౌతమ్..

నారాయణపేట జిల్లా నుండి చాలా నేర్చుకున్నా: ఎస్పీ

నారాయణపేట (విజయక్రాంతి): ఉద్యోగ జీవితంలో బదిలీలు అనేవి సర్వసాధారణం అని మనం ఎక్కడ ఉన్న, ఎలాంటి విధులు నిర్వర్తించిన అక్కడ కష్టపడి బాగా పని చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. పోలీస్ శాఖ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైందని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కష్టపడి బాగా పని చేసి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ తెలిపారు. అలాగే నారాయణపేట జిల్లా నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన అన్నారు. నారాయణపేట జిల్లాలో సుమారు రెండు సంవత్సరాలు జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై రాజేందర్ నగర్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(DCP) గా వెళ్తున్నందున జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీకి సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ అదనపు ఎస్పీ MD రియాజ్, డీఎస్పీ నల్లపు లింగయ్యలు జిల్లా పోలీసు అధికారులు సిబ్బందితో సన్మాన సభ కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ నారాయణపేట జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా అభివృద్ధి చెందడంలో చాలా తోడ్పాటునందించారని, జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగిందని, పోలీస్ సంక్షేమం కోసం ప్రతి అంశాన్ని చర్చించి, అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ సిగ్నల్స్ గాని, రోడ్డు భద్రత కోసం స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు ప్రతి విషయాన్ని కులంకషంగా చర్చించేవారని తెలిపారు. జిల్లాకు విశిష్ట సేవలందించి బదిలీపై వెళ్తున్నందున ఎస్పీనీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఎక్కడ నిర్వర్తించిన ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... సుమారు గత రెండు సంవత్సరాలు జిల్లాలో విధులు నిర్వర్తించడం జిల్లాతో, ప్రజలతో అవినాభావ సంబంధం ఉందన్నారు నారాయణపేట జిల్లాను ఎవరైనా సెన్సిటివ్ జిల్లా అంటారు కానీ ఇక్కడ చూస్తే అలాంటి తారతమ్యాలు ఏవీ లేవు అని అందరూ కలిసిమెలిసి ఉంటారని, జిల్లా అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసిమెలిసి బాగా పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

అలాగే పోలీస్ శాఖలు నేను వచ్చినప్పటినుండి నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, పోలీస్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో జిల్లాలో రెండు మూడు చిన్న సంఘటనలు జరిగినాయని వాటిని వెంటనే పరిస్కరించటం జరిగిందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం రెండు అదనాతన నూతన పోలీస్ స్టేషన్లు ధన్వాడ, రూరల్ నూతన అంగులతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఎస్పీ కార్యాలయంలో అదనపు గదులను ఏర్పాటు చేయడం జరిగిందని, ట్రాఫిక్ సిగ్నల్స్, భరోసా సెంటర్, వెహికల్స్ వాషింగ్ మెషీన్, డాగ్స్ నూతన గదులు మొదలగు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకుని బాగా కష్టపడి పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు శివశంకర్, రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, సైదులు, ఎస్సైలు, పోలీస్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.