calender_icon.png 30 September, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ పూలకు భలే డిమాండ్

30-09-2025 08:51:21 PM

వలిగొండ (విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పేర్చే పూలకు భలే డిమాండ్ ఏర్పడింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు ఎంతో నిష్టతో గౌరమ్మను తయారుచేసి అందంగా బతుకమ్మ తయారు చేసేందుకు గతంలో వివిధ ప్రాంతాల నుండి పూలను సేకరించేవారు. కానీ నేడు గ్రామాలలో భూములన్ని పంట పొలాలు, వెంచర్లుగా మారిపోవడంతో బతుకమ్మలకు పూలు కరువయ్యాయి. అయితే బతుకమ్మను తయారు చేసేందుకు ఉపయోగించే వివిధ రకాల పూలు మార్కెట్లో అమ్మకానికి రావడంతో వాటికి వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడడంతో బతుకమ్మ పూలకు అమాంతం డిమాండ్ పెరిగింది. దీంతో తప్పని పరిస్థితి కావడంతో ఎక్కువ ధర అయినప్పటికీ పూలను కొనుగోలు చేశారు.