4 May, 2026 | 12:32 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తున్నాం

20-09-2025 04:07 PM

జడ్చర్ల కావేరమ్మపేటలో కొత్తగా గొర్రెల, మేకల సంతను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..

జడ్చర్ల: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వేగంగా చేసుకుంటూ అడుగులు వేస్తున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) స్పష్టం చేశారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో ఏర్పాటు చేసిన కొత్త గొర్రెల, మేకల సంతను నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, కాపరులు, స్థానిక వ్యాపారులకు ఉపయోగపడే విధంగా సంతను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. పశువుల పెంపకం గ్రామీణ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకలాంటిదని, ఈ సంత ద్వారా వ్యాపార లావాదేవీలు సులభతరమవుతాయని, కాపరులకు తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత నర్సింహులు, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.