calender_icon.png 20 September, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి

20-09-2025 04:05:10 PM

- సమన్వయంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి

- పినపాక మండల ప్రభుత్వ అధికారులతో కలసి వంద రోజుల కూలీలకు పనిముట్లు పంపిణీ

- మీ సమస్యలు వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తా

పినపాక (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీల ఆర్థికాభివృద్ధి కోసమే నాడు కేంద్రంలోని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించిందని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉపాధి హామీ కూలీలకు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ కూలీలు వ్యవసాయం పనులు లేని సమయంలో ఉపాధి పొందేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమైందన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, పేద కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. 

ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, పొరపాట్లు జరిగితే సరిచేసుకోవాలని, మంచిగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ వథకాల అమలుపైన ప్రత్యేక సమావేశం నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్క అధికారి బాధ్యతగా వని చేయాలన్నారు. సమన్వయంతో వని చేసి మంచి పేరు తెచ్చుకోవాల తెచ్చుకోవాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మీసమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. మునుపెన్నడూలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, యువత గంజాయి బారిన పడకుండా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ అవగాహన కల్పించాలన్నారు.

అడవుల్లో ఉండే పేద పోడు రైతుల పైన ఫారెస్టు శాఖ అధికారులు ఎట్టిపరిస్థితుల్లో కేసులు పెట్టివద్దని, పోడు భూములుల్లో పంటలను తొలగించవద్దన్నారు. యూరియా సమస్య తలెత్తకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎట్టి పరిస్థితిలో కరెంటు సమస్య రానివ్వద్దని విద్యుత్ సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలన్నారు. వంద శాతం విద్యార్థులు టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. అన్ని విభాగాల ఇంజనీరింగ్ శాఖ అధికారులు పెడింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. దసరా పండుగ సందర్భంగా మహిళలు బతుకమ్మ  ఆడే, పాడే ప్రదేశాలతోపాటు చెరువుల వద్ద ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏడిఏ తాతారావు, తాసిల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో అనిల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం, వివిధ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు  పాల్గొన్నారు.