calender_icon.png 20 September, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్‌పహాడ్‌లో బీఆర్‌ఎస్ నాయకుల అరెస్టు కలకలం

20-09-2025 04:18:01 PM

పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత – చివరికి విడుదల

పెన్‌పహాడ్: పెన్‌పహాడ్‌లో బీఆర్‌ఎస్ నాయకుల అరెస్టుతో శనివారం రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామం సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని చివ్వేంల పోలీసులు ఓ బీఆర్ఎస్ నాయకుని అరెస్ట్ మరువకముందే పెన్ పహాడ్ లో ముగ్గురు బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

క్యాంపు ఆఫీస్‌లో సీఎం చిత్రపటం వివాదమా...?

ఇటీవల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ చిత్రపటాలు పెట్టిన కాంగ్రెస్ నాయకుల చర్య బీఆర్‌ఎస్ శ్రేణులకు మింగుడు పడలేదు. దీంతో ప్రజా సొత్తుగా ఉన్న క్యాంప్ కార్యాలయంలో ఏఏ ఫోటోలు ఉంచాలన్నా.. తీసివేయాలన్నా అధికారులు చూసుకుంటారని.. కాంగ్రెస్ జేజేలు అంటూ క్యాంప్ కార్యాలయంలోకి అక్రమంగా చొచ్చుకొని పోవడపై బీఆర్ఎస్ శ్రేణులు ఆ సమయంలో అహగ్రమై సోషల్ మీడియాలోకాంగ్రెస్ నేతలపై పోస్ట్లు వచ్చాయి. 

వీధిలో కుక్క వీడియో – కారణమా?

దీనిపై బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ ఓ సీనియర్ కాంగ్రెస్ నేతపై వ్యంగ్యంగా “వీధిలో మొరిగే కుక్క – అడవిలో సింహంల అనుకుంటే ఏలా ” అనే పోలికతో  రూపొందించిన వీడియో తన వాట్సాప్ కు రాష్ట్ర బీఆర్ఎస్ సోషల్ మీడియా పంపించిన పోస్ట్ రాగా తన అనుచర వర్గాలైన యల్లంల జగన్, పర్వతపు నాగయ్యకు పోస్టు చేశారు. ఈ వీడియో క్షణాల్లో తన బీఆర్ఎస్ కార్యకర్తలతో స్టేటస్, గ్రూపులో వైరల్ కావడంతో వాగ్వాదాలు మరింత చెలరేగాయయా.. లేదా కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేస్తే బీఆర్ఎస్ నాయకులు పోలీసుల అరెస్టుకు కారణమైందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

- అరెస్టు వెనుక మతలబ్ గోప్యమే..!

పోలీసులు ఆ బీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నా… అసలు కారణం ఏమిటో గోప్యంగా ఉంచారు పోలీసులు. మొదట “అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకులు దొంగరి యుగేందర్, యళ్లంల జగన్, పర్వతం నాగయ్యలు గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని అందుకే ముందస్తు చర్య తీసుకున్నారా.. రాజకీయ ఒత్తిడి కారణంగానే ఈ చర్య తీసుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.

- బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన – విడుదల

అరెస్టు వార్తతో పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒత్తిడి పెరగడంతో పోలీసులు చివరికి ఆ నాయకులను విడుదల చేశారు.