24-11-2025 08:12:37 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. సిర్గాపూర్ మండలం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటివరకు అద్దె భవనంలో తహసీల్దార్ కార్యాలయం కొనసాగించారు. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి ప్రత్యేక చొరవతో మండల కేంద్రంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిని మరమత్తులు చేయించి దాన్ని ఉపయోగంలోకి తీసుకోవడంతో మండల రెవెన్యూ భవనంగా మార్చి ప్రారంభించడం జరిగింది. అనంతరం మండల కేంద్రంలోనీ ఉర్దూ పాఠశాలకు వెళ్ళే దారి కొరకు నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రైతు వేడుకలో ఇందిరమ్మ చీరాల పంపిణి చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కొద్దిగా ఆలస్యం ఐనా తెలంగాణ ఆడబిడ్డలకు నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం పేదింటి ఆడబిడ్డకు నేడు చీరలు పంపిణి చేస్తున్నామని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యమని, స్యయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, మహిళలను ఆర్థిక బలోపేతం చేసేందుకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది, బిఆర్ఎస్ ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో 8 లక్షల కోట్లు అప్పు చేశారు. అభివృద్ధి మాత్రం జీరో చేశారు, రానున్న స్థానిక సౌంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికీ బాసటగా నిలిచి గ్రామాల్ని మరింత అభివృద్ధి వైపు వెల్లేల మనకు మనమే తొడ్పాటు చేసుకోవాలన్నారు.
అక్కడి నుండి గిరిజన బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసి కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నార అని విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉంటే తన దృష్టికి వెంటనే తీసుకు రావాలని వెంటనే సమస్యలను పరిశించడానికి నేను కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి విద్యార్థులకు హామీ ఇచ్చారు. అక్కడి నుండి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్యం పట్ల విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, రోగుల పట్ల డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి వైద్యం అందించాలని, విధులకు సమయపాలన పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తహసీల్దార్ కిరణ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ హేమంత్, ఆర్ఐ మదన్, ఎంపీడీఓ, యాదవ్ రెడ్డి, శ్రీనివాస్ రావ్ పాటిల్, మాజీ సర్పంచ్ స్వప్న శంకరయ్య స్వామి, మండల కాంగ్రెస్ పీరప్ప, జైరాజ్, కిషోర్, సాబెర్, అబ్రార్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.