24-11-2025 07:52:21 PM
దేవలయ భూమిలో ఎలాంటి పనులు చేపట్టిన కఠిన చర్యలు..
నాలుగు వైపులా సర్వే నిర్వహించి హద్దురాల ఏర్పాటు..
త్వరలోనే పూర్తిస్థాయిలో కంచె ఏర్పాటు..
చిట్యాల (విజయక్రాంతి): శ్రీ తిరుమల నాథ స్వామి దేవాలయ భూమిని సర్వే నిర్వహించి కబ్జాకు గురైన సుమారు 15 ఎకరాల పైగా అన్యాక్రాంతమైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని శ్రీ తిరుమల నాథ స్వామి దేవాలయ భూమికి సర్వే నెంబర్ 201 లో గల 102 ఎకరాల భూమికి గుట్టకు నాలుగు వైపులా సర్వే నిర్వహించి హద్దురాలను ఏర్పాటు చేయాలని గత 13 నెలలుగా పలుమార్లు గ్రామస్థాయి నుండి జిల్లా కలెక్టర్ వరకు గ్రామానికి చెందిన ప్రముఖులు ఫిర్యాదు చేయగా, అధికారులు సర్వే నిర్వహించి గుట్టకు నాలుగు వైపులా హద్దురాలను ఏర్పాటు చేశారు.
త్వరలోనే నాలుగు వైపుల పూర్తి కంచెను ఏర్పాటు చేస్తామని, ఇకపై దేవస్థాన భూమిలో రోడ్డు పనులు, మట్టి తవ్వకం లాంటివి చేపట్టవద్దని, చేపట్టిన యెడల చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సుమారు 15 ఎకరాల పైగా అన్యాక్రాంతమైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్వేయర్ పవన్ కుమార్, మండల సర్వేయర్ రజినీకాంత్, దేవస్థాన అధికారులు సుమతి, అంబాటి నాగిరెడ్డి, గ్రామ జిపిఓ రాణి, డిప్యూటీ తాసిల్దార్ సురేష్, గ్రామ ప్రముఖులు చేకూరి గణేష్ మాదిగ, పొట్లపల్లి చిన్నస్వామి, పొట్లపల్లి నరసింహ, నీలకంఠం లింగస్వామి, ఏర్పుల దామోదర్, ఏర్పుల రాకేష్, పున్న విష్ణు, మాచర్ల యాదగిరి, ఏర్పుల సత్తయ్య, పొట్లపల్లి వేణు, మోర రాములు తదితరులు పాల్గొన్నారు.