24-11-2025 07:55:15 PM
కాటారం(మహాదేవపూర్),(విజయక్రాంతి): మహదేవపూర్ మండలానికి చెందిన లారీ డ్రైవర్ల కు ట్రాఫిక్ నియమాలపై మహాదేవపూర్ పోలీసు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అతిక్రమించినవారిపై చట్టరీత్య చర్యలు చేపడతామని ఎస్ ఐ లు కురిక్యాల పవన్ కుమార్, సాయి శశాంక్ లు పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతి వేగంగా వాహనం నడపకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. తగినంత నిద్ర తీసుకుని ఆరోగ్య నియమాలు పాటించి వాహనం నడపాలని కోరారు. నియమాలు అతిక్రమించిన వారిపై చట్టపర చర్యలు తీసుకోనున్నట్లు మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్, సాయి శశాంక్ తెలిపారు.