10-01-2026 09:56:25 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): మండలంలోని 1,2 మారెళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, రైతులకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్ట్‌ను ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
ప్రస్తుత దశలో జరుగుతున్న పనుల వివరాలను ఎమ్మెల్యేకు అధికారులు వివరించగా, అన్ని అడ్డంకులను అధిగమిస్తూ మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ పూర్తయితే పరిసర గ్రామాల రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.