calender_icon.png 23 December, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీ టెట్ పరీక్షలను వాయిదా వేయాలి

23-12-2025 06:32:42 PM

టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగ రాంబాబు

ఆళ్ళపల్లి,(విజయకాంతి): టీజీ టెట్ పరీక్షలను వాయిదా వేయాలని టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు, ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టీచర్ఎ లిజిబిలిటి పరీక్షలు జనవరి 3వ తేదీ నుండి జరగనున్నాయని, ఈ సారి సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు వేల సంఖ్యలో ఈ పరీక్షలు రాయడానికి దరఖాస్తులు  నమోదు చేసుకున్నారు.

డిసెంబర్ నెల ప్రారంభం నుండే మన రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడం జరిగిందని.ఈ ఎన్నికలల్లో ఉపాధ్యాయులు రిటర్నింగ్ అధికారులుగా,ప్రిసైడింగ్,పోలింగ్ అధికారులుగా మూడు విడతలల్లో ఉండటం వల్ల టెట్ పరీక్షకు సిద్ధం కాలేకపోయారున్నారు. కావున జనవరి 3నుండి జరిగే పరీక్షలను ఒక నెల రోజులపాటు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.