calender_icon.png 23 December, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"మీ డబ్బు - మీ హక్కు" కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

23-12-2025 06:48:30 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజలు "మీ డబ్బు - మీ హక్కు" కార్యక్రమాన్ని చదివినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకర్లు, ఖాతాదారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  "మీ డబ్బు - మీ హక్కు" అని, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల కంటే పైగా బ్యాంకులలో ఖాతాలు కలిగి ఉండి నేటి వరకు డబ్బు క్లెయిమ్ చేసుకోని వారి కొరకు ఈ నెల 1వ తేదీ నుండి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 65 వేల ఖాతాలు ఇలాంటివి ఉన్నాయని, ఈ ఖాతాలలో 15 కోట్ల 76 లక్షల రూపాయలు జమ కలిగి ఉన్నాయని తెలిపారు.

ఈ నెల 12వ తేదీ వరకు 254 ఖాతాల వారు 1 కోటి 34 లక్షల రూపాయలు క్లెయిమ్ చేసుకున్నారని, జిల్లాలోని ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో సర్పంచులను సమన్వయం చేసుకోవాలని, బ్యాంకులు గ్రామాల వారీగా క్లెయిమ్ చేసుకోని వారి వివరాలతో జాబితా తయారుచేసి అందించాలని తెలిపారు. అధికారులు, మెప్మా, సెర్ప్, స్వయం సహాయక సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా క్లెయిమ్ చేసుకున్న వారికి ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలసూచికలను ఆవిష్కరించారు.