23-12-2025 06:39:55 PM
- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఆర్ అండ్ బి, పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రమాద ప్రదేశాలలో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి 1 నుండి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.