23-12-2025 06:51:43 PM
తిమ్మాపూర్ పశువైద్యధికారిని నిహారిక
దుబ్బాక,(విజయక్రాంతి): గొర్రెలు, మేకల పెంపకం దారులు వారి జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ ముందు తప్పనిసరి తాగించాలని తిమ్మాపూర్ పశువైద్యాధికారిని నిహారిక సూచించారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ టీకాలను సర్పంచ్ వేముల అరుణ రాజేశం, ఉపసర్పంచ్ రుద్రారం యాదగిరితో కలిసి వేశారు. ఈ సందర్బంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ నెల 21 నుండి 31వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవాలకు నట్టల నివారణ మందులు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయన్నారు. తిమ్మాపూర్ పరిధిలో జీవాల పెంపకందార్లు, గ్రామాల్లో మేకలు, గొర్రెలు ఉన్న రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం వెటర్నరీ సిబ్బంది శంకరయ్య, గ్రామస్తులు బొమ్మ స్వామి, రైతులు ధర్ని మహేందర్, మల్లయ్య, పర్స మల్లయ్య, సిద్దన బాలయ్య తదితరులు ఉన్నారు.