calender_icon.png 23 December, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యాలయాలకు గ్రీజర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజ్జన్న

23-12-2025 06:45:02 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయం లో 17 గ్రీజర్లను, భూపతిపూర్ లోని జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో23 గ్రీజర్లను ఎమ్మెల్యే విజయరమణ రావు  తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి ఆయా విద్యాలయాలకు మంగళవారం అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు  మాట్లాడుతూ... ఈ రెండు విద్యాలయాల్లో కరెంటు, ప్లంబర్ పనులకు సైతం నిధులను సొంత ఖర్చులు వెచ్చించి సమకూర్చారు. గ్రీజర్లు, ఇతర పనులకు మొత్తం రూ.8 లక్షల మేరకు  ఎమ్మెల్యే  వెచ్చించారు. చలికాలంలో విద్యార్థులు చన్నీల స్థానాలు చేయడం ఉండకూడదనే ఉద్దేశంతో గ్రీజర్లను పంపిణీ చేసినట్టు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. భూపతిపూర్ విద్యాలయంలో ఫ్యాన్లు, అవసరమైన వంట సామాగ్రి కొనుగోలుకు అప్పటికప్పుడే ఆయన సొంత ఖర్చులను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

రెండు రోజుల్లో వీటిని సమకూర్చానున్నట్టు తెలిపారు. విద్యాలయాల్లో సమస్యల పరిష్కారానికి, వసతులు ఏర్పాటుకు ఏ సమయంలోనైనా తనను సంప్రదిస్తే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును మాత్రం ఉపాధ్యాయులు మంచిగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.

దాదాపు 200 కోట్ల రూపాయలతో ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. దీనివల్ల విద్యారంగం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధత తెలియజేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు  మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు  పాల్గొన్నారు.