calender_icon.png 27 July, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూర్ మేయర్ అభ్యర్థిగా సురేందర్ రెడ్డి..?

27-07-2025 12:17:31 PM

అధికారికంగా ప్రకటన ఖరారు అయినట్లే.!

ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం 

పార్టీ బలోపేతానికి స్పీడ్ పెంచిన సురేందర్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా అధికార పార్టీ అభ్యర్థి సురేందర్ రెడ్డి పేరును దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఇందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం సానుకూలంగా స్పందించి సురేందర్ రెడ్డి పేరును అంతర్లీనంగా ప్రకటించారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సురేందర్ రెడ్డి స్పీడ్ పెంచి అందర్నీ ఏకతాటి పైకి తీసుకువచ్చి తన మార్కును కనిపించేలా ప్రచార పర్వాన్ని మరింత వేగం పెంచినట్లు తెలుస్తుంది. గత వారం పది రోజుల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లలోని నేతలతో బిజీబిజీగా సమావేశాలను నిర్వహించి గెలిపే లక్ష్యంగా పావులు కదపడంతో సురేందర్ రెడ్డి ఒక పట్టు సాధించినట్లు తెలుస్తుంది. ఒక పక్క మున్సిపాలిటీని అధికార పార్టీ కైవసం చేసుకోవడంతోపాటు మేయర్ గా సురేందర్ రెడ్డి నిలబడాలనే కసితో రానిస్తున్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీ హయాంలోనే మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అవతరించడంతో అతిపెద్ద కార్పొరేషన్ కు మొదటి మేయర్ అభ్యర్థిగా నిలవాలని ఆశతో సురేందర్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే 60 డివిజన్ ల గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల సైతం ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

సురేందర్ రెడ్డి తన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో అలా చేస్తూ ముందుకు వెళుతుండడంతో కార్పొరేషన్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. మొన్నటివరకు అధికార పార్టీలో మేయర్ అభ్యర్థులుగా నలుగురు నుంచి ఐదుగురు పేర్లు వినిపించేవి, తాజాగా సురేందర్ రెడ్డి పేరు ఒక్కటే వినిపిస్తుండడంతో సురేందర్ రెడ్డి తన ప్రచార స్పీడును మరింతగా పెంచారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు సమీక్ష, సమావేశాలు నిర్వహించి పార్టీ పటిష్టానికి సంబంధించి సూచనలు చేస్తూ ఆ నివేదికలను ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర అధిష్టానానికి పంపిస్తూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు.  జిల్లా కేంద్రంలో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలమయం అయిన లోతట్టు ప్రాంతాలను సురేందర్ రెడ్డి స్వయంగా పరిశీలించి వాటి పరిష్కారం కావాల్సిన సూచనలు చేయడంతో చర్చనీయాంశంగా మారుతుంది. తాను రేపు మేయర్ గా వచ్చిన వెంటనే ఎమ్మెల్యేతో కలిసి ఈ సమస్యలు అన్నిటినీ పరిష్కరించి ఇబ్బందులు లేకుండా చేస్తానని భరోసా ఇవ్వడం కూడా మేయార్ అభ్యర్థికి సాంకేతాలు కనిపిస్తున్నాయి.

అధికార పార్టీ మేయర్ అభ్యర్థిని అంతర్గతంగా ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలలో అభ్యర్థులు కరువు అయినట్లు ప్రచారం జరుగుతుంది. సురేందర్ రెడ్డి మేయర్ అభ్యర్థిగా రాణిస్తూ ఉండడంతో అధికార పార్టీలోని కొందరు ఆశావాహులు సమర్థిస్తారా?  వ్యతిరేకిస్తారా ? అనేది వేచి చూడాలి. కార్పొరేటర్ బరిలో ఉండేందుకుగాను చాలామంది ఆసక్తి చూపిస్తున్నప్పటికీ సురేందర్ రెడ్డి మాత్రం భగీరథ కాలనీ, బండమీదిపల్లి డివిజన్ ల నుంచి బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తుంది.  ఇది ఇలా ఉంటే సురేందర్ రెడ్డి కీలక వ్యక్తులకు అనుసంధానం చేసుకొని కార్పొరేషన్ పై అధికార పార్టీ జెండా ఎగరవేద్దామని సాంకేతాలు ఇస్తూ స్పీడును మరింతగా పెంచారు. రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం ఉమ్మరం కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయ వేడి మరింత వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీతో పోటీపడే పరిస్థితి కనిపించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ముందస్తుగా మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తారా ? లేదా? అనేది అయోమయంగా నెలకొంది. 

ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం..

పాలమూరు మున్సిపాలిటీ అంచలంచెలుగా ఎదుగుతూ తమ ప్రభుత్వమే కార్పొరేషన్ గా గుర్తించింది. కార్పొరేషన్ పై తమ పార్టీ జెండా ఎగురవేసేందుకు తాము అంతగా ధీమగా ఉన్నాం. మెజార్టీ స్థానాల్లో గెలుచుకొని మేయర్ ఇస్తానని కైవసం చేసుకుంటాం. ఎమ్మెల్యే సూచనలు తీసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని విజయతిలాలకు చర్చలనగా మా అందరి సంకల్పం అంటూ ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.