20-05-2025 05:28:25 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ(District Minority Welfare Department) అభివృద్ధి అధికారి మోహన్ సింగ్ తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను వందమందికి ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 24 దరఖాస్తు చేసుకుంటే వచ్చేనెల 6న పరీక్ష నిర్వహించి మెరిట్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.