calender_icon.png 20 May, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగ హక్కుల సాధనకు మరో పోరాటం..

20-05-2025 05:49:11 PM

ఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మాదిగ హక్కుల సాధనే ధ్యేయంగా మరో పోరాటం తథ్యమని మాదిగ హక్కుల దండోరా(Madiga Hakkula Dandora) రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో సీనియర్ నాయకుడు కాంపల్లి రాజం అధ్యక్షతన మంగళవారం జరిగిన మాదిగ హక్కుల దండోరా నియోజవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 

మాదిగలకు విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో దక్కాల్సిన న్యాయమైన హక్కుల సాధనకు మరో పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి  సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో లెదర్ పార్కుల పునరుద్దరణ ద్వారా లక్షమంది మాదిగలకు ఉపాది దొరుకుతుందని అందుకు ప్రభుత్వం శ్రద్ధ వహించి నిధులు కేటాయించాలన్నారు. ఇందిరమ్మ ఇంటి పథకంలో మాదిగలకు ప్రాదాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలో మాదిగ భవన్ నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సహకరించాలని కోరారు.

కొత్త కమిటీల నియామకం

ఈ సమావేశంలో మాదిగ హక్కుల దండోరా నూతన పట్టణ కమిటీ ని ఎన్నుకున్నారు. అలాగే నియోజకవర్గ ఇంచార్జ్, కన్వీనర్ కోకన్వీనర్ లతో పాటు బెల్లంపల్లి, కన్నెపల్లి మండలాలకు కన్వీనర్లను నియమించినట్లు, సీనియర్ నాయకుడు కాంపల్లి రాజ్యoను రాష్ట్ర కమిటీ లోకి ప్రమోట్ చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ మాదిగ ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలాల రమేష్ మాదిగ, జిల్లా అధ్యక్షులు కడారి రమేష్ మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ నాతరి కిరణ్ మాదిగ, నాయకులు కుశ్నపల్లి రాజలింగు మాదిగ, దాసరి బానయ్య మాదిగ, కాంపల్లి సతీష్ మాదిగ ఎనగందుల నరేష్ మాదిగ, గద్దల కుమార్ మాదిగ, అంబాల రాజేందర్ మాదిగ ఆయిల్ల స్వామి మాదిగ కడపాక శంకర్ మాదిగ రామన్న పాల్గొన్నారు.