calender_icon.png 20 May, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామర్థ్యాల పెంపుతో ఉత్తమ ఫలితాలు

20-05-2025 05:38:38 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎఫ్ఎల్ఎన్ తో సామర్ధ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థుల్లో ఉత్తమ ఫలితాలను తీసుకురావచ్చని కేసముద్రం, ఇనుగుర్తి మండల విద్యాశాఖాధికారులు కాలేరు యాదగిరి, జంగా రూపారాణి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో రెండు మండలాల ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ పై 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ శిక్షణను బాగా ఉపయోగించుకొని విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేలా కృషి చేయాలన్నారు.

అనంతరం 158 మంది ఉపాధ్యాయులకు మండల రిసోర్సు పర్సన్లు శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులలోని ఎఫ్ఎల్ఎన్ అంశాలపై శిక్షణ ఇచ్చారు. వివిధ కృత్యాలు, పరస్పర చర్చల ద్వారా అర్ధవంతమైన శిక్షణ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్పి కె.సారంగం, ఎం.ఆర్.పీ. లు గనె యాదగిరి, బొరిగం రాములు, ఏదునూరి అశోక్, ఎన్నం భాస్కర్, వెలమల భాస్కర్, వట్నాల సత్యనారాయణ, మేకల సురేష్ నాయుడు, జి. మోహనకృష్ణ, ఘనపురం కృష్ణ, ఎస్.భాస్కర్, ఎం.ఐ.ఎస్. కో ఆర్డినేటర్ ఎస్.కె. ఖాదర్, కంప్యూటర్ ఆపరేటర్ వెన్ను భిక్షపతి, సీఆర్పీలు ఎం.డి. సుల్తానా, బండారు స్వాతి, ఇస్సంపల్లి ఉదయ్, చీర మురళి, నేలకొండ నాగవాణి, పులి సరిత, ధారావత్ రవి, నేరెళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.