calender_icon.png 20 May, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమస్యలపై పోరాడుతాం

20-05-2025 12:27:29 AM

-ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి

-సర్కార్‌కు ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ పని చేస్తుందని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. ఉద్యోగులకు రిటైర్డ్ బెనిఫిట్స్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లో తెలంగా ణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఐదు డీఏలు, పీఆ ర్సీ, పెన్షన్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్త్‌కార్డుతో ప్రతీఒక్కరికి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్నారు.

హోమ్‌గార్డ్ ఉద్యోగుల కు ఇంకా జీతం రాలేదని, ఉద్యోగుల 5ప్రధాన డిమాండ్‌లను నెరవేర్చాలని డిమాండ్ చేశా రు. ఉద్యోగ సంఘాల డిమాండ్స్ నెరవేర్చాల ని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ప్రభుత్వానికి సూచించారు. 10వేల మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలన్నారు.

రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగుల సమస్యల కోసం ఒక కమిటీ వేసినా ఇంతవరకు స్పందన లేదని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ విమర్శించారు. కమిటీలతో రాష్ర్ట ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. నవీన్ మిట్టల్ నేతృత్వంలో వేసిన కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.

జూన్ 2న ఉద్యోగుల 5 ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై త్వరలో అన్ని  రాజకీయపార్టీలను కలుస్తాన్నారు. జాక్ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తా మని, ఉద్యోగుల జాక్‌తో సీఎం నేరుగా చర్చిం చి జూన్ 2లోగా అన్ని సమస్యలు పరిష్కరించాలని దేవీప్రసాద్ అన్నారు.

రాజకీయాలకు అతీతంగా ఈ కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నారని, ఉద్యోగ సంఘాలను ఏకం చేస్తామని ఉద్యోగ సంఘాల నేత విఠల్ చెప్పారు. ఇది పోటీ సంఘం కాదని, తమది సమన్వయ కమి టీ అని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాలతో సీఎం మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఏ హమీద్, భుజంగరావు లక్ష్మణ్, శ్యాంరావు, బాలమల్లు, హసన్, రంగరాజు, ఆదినారాయణరెడ్డి, కళ్యాణ్ పాల్గొన్నారు.