20-05-2025 05:54:23 PM
ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): కాకతీయులు నిర్మించిన కోట గుళ్ళు ఆలయం అద్భుత శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయని రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి(State ACB Director Tarun Joshi) అన్నారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం, కోట గుళ్ళను సందర్శించారు. ఈ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషికి ఘన స్వాగతం పలికారు. మొదట గణపతి, నందీశ్వర గణపేశ్వర స్వాములకు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో శిల్పాలను, గోపురాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రామప్ప శిల్ప సంపదని పోలిన విధంగానే కోటగుళ్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. కోటేశ్వరాలయం, నంది మండపం, నాట్య మండపాల్లో శిల్పకళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డారు. ఏసీబీ డైరెక్టర్ వెంట చిట్యాల, భూపాలపల్లి సిఐలు మల్లేష్, నరేష్ కుమార్ గౌడ్, గణపురం ఎస్ఐ రేఖ అశోక్ తదితరులు ఉన్నారు.