calender_icon.png 20 May, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హై స్పీడ్ రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

20-05-2025 05:44:42 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఉమ్మడి నల్గొండ ప్రజలకు రైల్వే శాఖ(Department of Railways) గుడ్ న్యూస్ చెప్పింది. హై స్పీడ్ రైల్ కారిడార్ కింద శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు సూర్యాపేట మీదుగా వెళ్లే హై స్పీడ్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకు ఎఫ్ఎల్ఎస్ ఓకే చెప్పింది. అలాగే మరో లైన్ సూర్యాపేట, నల్లగొండ, చండూరు, చింతపల్లి మీదుగా డోర్నకల్-గద్వాల లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు రైల్వే పనులకు నిధులను కేటాయించడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.