calender_icon.png 24 January, 2026 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌కేపురం ఫ్లై ఓవర్ రీ అలైన్మెంట్ చేయాలి

24-01-2026 12:00:00 AM

సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి వినతి

మేడ్చల్, జనవరి 23 (విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆర్కే పురం ఫ్లై ఓవర్ రీ అలైన్మెంట్ చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జిహెచ్‌ఎంసి కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్కే పురం ఫ్లైఓవర్ను రీఅలైన్మెంట్ చేయడం వల్ల పరిసర ప్రాంతాలైన పల్లవి విల్లా అపార్ట్మెంట్ వాసు లు, స్థానిక దుకాణదారులు, అలాగే ఆర్మీ డిఫెన్స్ ల్యాండ్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తగ్గేలా ఫ్లైఓవర్ రీఅలైన్మెంట్ చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసి ప్రాజెక్టు అధికారులు, సమస్యను సానుకూలంగా పరిశీలించి అవసర మైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రోహిణి, డిప్యూటీ ఇంజనీర్ రేణుక, అసిస్టెంట్ ఇంజనీర్లు వెంకట్ రెడ్డి, సుజిత్,  కాలనీ వాసులు బి.టి. శ్రీనివాస్, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.