24-01-2026 12:00:00 AM
27న ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఓసిల మహాదీక్ష
వాల్ పోస్టర్‌ను విడుదల
ముషీరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): జాతీయ స్థాయిలో ఓసీల స్థితిగ తులను అధ్యయనం చేయడానికి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యద ర్శి కాచం సత్యనారాయణ గుప్త, గౌరవాధ్యక్షుడు పోచంపల్లి రమణారావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఓసి కమిషన్ సాధనకై ఫిబ్రవరి 27న జంతర్ మంతర్ వద్ద చేపట్టే మహాదీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్ ను వారు పలువురు సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్క రించారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు సంది తిరుపతి రెడ్డి, కోటి హన్మంత్ రావు, గుర్రం పాపిరెడ్డి, నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, బెల్దే విశ్వం గుప్త, ఎలిమినేటి సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.