calender_icon.png 24 January, 2026 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిమార్గమే మానసిక ప్రశాంతతకు మార్గం

24-01-2026 12:00:00 AM

మాజీ మేయర్ మేకల కావ్య

జవహర్ నగర్, జనవరి 23(విజయక్రాంతి): భక్తిమార్గమే మానసిక ప్రశాంతతకు నిలయమని, ముత్యాలమ్మతల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని మాజీ మేయర్ మేకల కావ్య అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ వికలాంగులకాలనీలోని ముత్యాలమ్మతల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆలయ ఛైర్మన్ బూడిద వెంకటేశ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్  పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, యువజన విభాగం అధ్యక్షుడు భార్గవరామ్, సీనియర్ నాయకుడు రాజశేఖర్, నాయకులు ప్రసాద్ గౌడ్, రమేషాచారి, ఎల్లస్వామి, నర్సింహా, మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.