calender_icon.png 26 October, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే సత్యం

25-10-2025 08:39:22 PM

ఎలాంటి కటింగ్ లేకుండా బస్తాలు దిగుమతి చేసుకోవాలి

 చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం

మల్యాల,(విజయక్రాంతి): చొప్పదండి  నియోజకవర్గ మల్యాల మండలంలోని ముత్యంపేట, రామన్నపేట గ్రామాలలో సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల  కొనుగోలు కేంద్రాలను చొప్పదండి   శాసన సభ్యులు  మేడిపెల్లి సత్యం శనివారం ప్రారంభించారు. గత ప్రభుత్వం లాగా రైతుల దగ్గర నుండి ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి కటింగ్ లేకుండా రైతుల ధాన్యం బస్తాలు రైస్ మిల్లర్ల దించుకోవాలని ఆదేశించారు. రైతులకు ఒక్క పైసా కూడా నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.