25-10-2025 08:40:59 PM
అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బి హెచ్ ఇ ఎల్ మెట్రో కాలనీలో ఉన్న పంచముఖ హనుమాన్ టెంపుల్ లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు స్థానికులు, ఆలయ సభ్యులు తెలియజేశారు. ఆలయంలో దొంగలు పడడం చాలా బాధాకరమని ఆలయ సభ్యులు స్థానికులు బాధాకరమని, చోరీకి పాల్పడిన వారిని తొందరగా గుర్తించి శిక్షించాలని కోరారు. అమీన్ పూర్ పోలీసులు సిసి ఫుటేజ్ లో రికార్డు అయినా దృశ్యాలను తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.