calender_icon.png 26 October, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ

25-10-2025 08:38:28 PM

ఎమ్మెల్యే జిఎంఆర్..

పటాన్ చెరు: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్ చెరు నియోజకవర్గం నిలుస్తోందని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ పురస్కరించుకొని శనివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని పటాన్ చెరు, ఇస్నాపూర్, పాశమైలారం, బొల్లారం, రామచంద్రాపురం, అమీన్ పూర్, గుమ్మడిదల, బొంత పల్లి, ఖాజీపల్లి, తదితర ప్రాంతాలలో నివసిస్తున్న 50 వేల మంది ఉత్తర భారతీయులకు 10 లారీల చెరుకును సొంత నిధులతో కొనుగోలు చేసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరి సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా  పనిచేస్తున్నామని తెలిపారు. త్వరలో సాకి చెరువు కట్ట పైన సూర్య దేవాలయం, ఫంక్షన్ హాల్ నిర్మించబోతున్నట్లు తెలిపారు.  భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని తెలిపారు.

శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామిని శివపార్వతుల కళ్యాణంకి ఆహ్వానం 

విజయ యాత్రలో భాగంగా హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో గల శ్రీ శృంగేరి శంకర మఠానికి విచ్చేసిన జగద్గురు దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధీశ్వరులు  శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని శనివారం ఉదయం పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఫల సమర్పణ చేసి పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించాలని కోరారు. అతి త్వరలో పటాన్ చెరు లో నిర్వహించబోయే శ్రీ శివపార్వతుల కళ్యాణం, విశేష గురువందన సభకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని స్వామివారికి విన్నవించారు. ఇందుకు సమ్మతించిన జగద్గురు పీఠాధిపతులు తప్పకుండా విచ్చేస్తామని తెలియజేశారు.  స్వామి వారికి ఎమ్మెల్యే జిఎంఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

మున్సిపాలిటీల  అభివృద్ధి కృషి చేస్తాం 

 తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం గ్రామ పరిధిలోగల సాయి దర్శన్ కాలనీలో 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని మహదేవుని పురం కాలనీలో అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ... తెల్లాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీల విలీనమైన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, డిఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, కాలనీవాసులు పాల్గొన్నారు.