calender_icon.png 11 May, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 ఫలితాల్లో మానుకోట ప్రతి ఏటా అగ్రస్థానంలో నిలపాలి

09-05-2025 11:09:24 PM

ఎమ్మెల్యే మురళీ నాయక్

మహబూబాబాద్,(విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో ప్రతి ఏటా మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపే విధంగా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కోరారు. ఈ ఏడాది పది ఫలితాల్లో మహబూబబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలవడం పట్ల ఎమ్మెల్యే మురళీ నాయక్ హర్షం వ్యక్తం చేసారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో డిఇఓ డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, ఇతర జిల్లా విద్యాశాఖ విభాగాల అధికారులు అప్పారావు, మందుల శ్రీరాములు, మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండల విద్యాధికారులు వెంకటేశ్వరరావు, రాందాస్, యాదగిరి తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.

ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు పది ఫలితాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 99.29 శాతంతో జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు అధికారులను అభినందించారు. ప్రతి సంవత్సరం ఇదే స్ఫూర్తి ని కొనసాగించే విధంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని, ప్రభుత్వం పేద విద్యార్థుల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.