10-05-2025 12:00:00 AM
మంచిర్యాల, మే 9 (విజయక్రాంతి) : రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించాలని, శాస్త్రీయ పంట సాగే కాకుండా భూసారం సంరక్షించుకునే విధం గా వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనిత, మ్యాట్రిక్స్ సి.ఈ.ఓ. ఉదయ్ కుమార్ లతో కలిసి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
శాస్త్రీయ పంటలైన వరిధాన్యం వంటి పం టలను మార్పు లేకుండా సాగు చేయడం వలన భూసారం దెబ్బతింటుందని, పంట మార్పిడి విధానాన్ని అవలంభించడం వలన భూసారం పెంపొందించడంతో పాటు భూ గర్భ జలాలను కాపాడుకోవచ్చని తెలిపారు. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, కూరగాయల సాగు, వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా అధిక దిగుబడితో ఆదాయం పొందడమే కాకుండా భూసారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
ప్రతి సంవత్సరం పంట సాగు ప్రారంభం ఆలస్యం కావడంతో అకాల వర్షాల కారణంగా నష్టం జరుగుతుందని, ముందుస్తుగా పంట సాగు ప్రారంభిం చినట్లయితే ప్రకృతి వలన కలిగే నష్టాల నుండి బయట పడవచ్చని, ఖరీఫ్‌లో సన్నరకం వడ్ల పంట సాగు చేసే విధంగా రైతు లను ప్రోత్సహించాలని, రబీ సీజన్‌లో పంట మార్పిడిని ప్రోత్సహించి అధిక ఆదాయం పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఫర్టిలైజర్ దుకాణాలపై నిఘా..
జిల్లాలోని ఆయా మండలాల వ్యవసా య అధికారులు వారి పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణాలపై నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ఫెర్టిలైజర్, విత్తనాల నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని, ఆన్ లైన్ నమోదు చేసిన వివరాలు, ఆఫ్ లైన్ నిల్వలను పరిశీలించాలని, మండలం లో కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నా రు.
వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటల ద్వారా అధిక దిగుబడి సాధించి ఆదాయం పొందుతున్న రైతులతో రైతువేదికలలో సమావేశా లు ఏర్పాటు చేసిన రైతులకు పంట సాగు మెళకువలు, దిగుబడి, మార్కెటింగ్, కనీస మద్దతు ధర ఇతర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.
అటవీ జంతువుల నుండి పంట నష్టానికి అవకాశం ఉన్న ప్రాంతాలలో పామాయిల్ పంట సాగు చేసేలా రైతులకు వివరించాలని, గిరిజన ప్రాంతాలు, అటవీ, పోడు భూములలో వెదురు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని, మిగతా అనువైన ప్రాంతాలలో కూరగాయలు సాగు చేసేలా చూడాలని తెలిపారు.
పప్పు ధాన్యాల దిగుబడి పెరిగితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
జిల్లాలో పప్పుధాన్యాల పంట సాగులో దిగుబడి పెరిగితే అంచనా వేసి అధిక మొత్తంలో ఉన్నట్లయితే కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. అవకాశం ఉన్న రైతులు పామాయిల్ సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని, ప్రతి రోజు పంట సాగు ప్రక్రియను పర్యవేక్షిస్తూ ప్రతి చర్యను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
పంట సాగులో సందేహాలు, అనుమానాలు ఉన్నా, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ డివిజనల్ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, మండలం వ్యవసాయ విస్తరణాధికా రులు, ఉద్యానవన - పట్టు పరిశ్రమశాఖ అధికారులు, సూక్ష్మ నీటిపారుల శాఖ జిల్లా సమ న్వయకర్తలు పాల్గొన్నారు.