10-05-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 9 (విజయ క్రాంతి):నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన వారికే ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ వార్డు 1 ఎస్సీ కాలనీలో గల ఇందిరమ్మ ఇం డ్ల అర్హుల జాబితాలోని లబ్ధిదారుడి ఇంటిని పరిశీలించి, లబ్ధిదారుడి ఆదాయం, కుటుం బ నేపథ్యం, రేషన్ కార్డు వంటి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత లేని పేర్లు జాబితాలో ఉన్నట్లయితే విచారించి వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అర్హులకు మాత్రమే ఇండ్లు మం జూరు చేస్తుందని, ఈ నేపథ్యంలో జాబితా లో గల పేర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్ర మంలో ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నర్సరీలో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి :-
నర్సరీలో పెంచుతున్న ముక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటే ష్ ధోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలోని నర్సరీని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నర్సరీలోని మొక్కలు ఉండిపోకుండా ప్రతిరోజు సకాలంలో నీటిని అందించాలని, పశువులు రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని పంచాయితీ కార్యదర్శి ని ఆదేశించారు.
అనంతరం అడ గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుప త్రిలోని వార్డులు, హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా వైద్యులు, సిబ్బంది విధులకు గైర్హాజరు కాకూడదని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు.
గ్రామంలో రూర్బన్ పథకం క్రింద నిర్మిస్తు న్న సామూహిక మరుగుదొడ్డి సముదాయము నిర్మాణ పనులను పరిశీలించి జూన్ మొదటి వారంలోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, వైద్యులు, ఇబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.