12-12-2025 09:53:42 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వాగ్దేవి విద్యాసంస్థల అధినేత చందుపట్ల దేవేందర్ రెడ్డి మామ చాడ రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో ధర్మసాగర్ మండలం కేతంపల్లి గ్రామంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి దంపతులు శుక్రవారం ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చందుపట్ల దేవేందర్ రెడ్డి,వాణి వాహిని దేవి దంపతులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చందుపట్ల సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.