12-12-2025 10:01:40 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పోచపూర్ గ్రామంలో శుక్రవారం ఎస్ఐ మహేష్ ప్రజలకు, అభ్యర్థులకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై పై అవగాహన కల్పించారు. ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు, కుల-మత వివక్షతను ప్రదర్శించడం పూర్తిగా చేయరాదని ఆయన హెచ్చరించారు. అలాగే, గ్రామంలోని కిరాణా షాపుల్లో మద్యం విక్రయం పూర్తిగా నిషేధమని, ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.