12-12-2025 09:50:42 PM
చివ్వెంల,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల మొత్తం ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) కఠినంగా అమల్లో ఉంటుందని చివ్వెంల ఎస్సై వి. మహేశ్వర్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా అభ్యర్థులు, కార్యకర్తలు, అనుచరులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.
ఎస్సై మహేశ్వర్ మాట్లాడుతూ... విజయోత్సవాల పేరిట బైక్ ర్యాలీలు, భారీ శోభాయాత్రలు, డీజేలు, పెద్ద సౌండ్ సిస్టమ్‌లు, రాత్రివేళల్లో చలిమంటలు వేసుకుని గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధించబడిందని తెలియజేశారు. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి నాయకుడు, అభ్యర్థి, కార్యకర్త, గ్రామ ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఎస్సై మహేశ్వర్ విజ్ఞప్తి చేశారు.