12-12-2025 10:22:48 PM
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా -మూడ్ నగేష్
మోతే,(విజయక్రాంతి): మండల పరిధిలోని సర్వారం గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా మూడ్ నగేష్ ప్రచారానికి చివరి రోజు కావడంతో సర్వారం గ్రామంలో ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ ప్రచారంలో మూడ్ నగేష్ మాట్లాడుతూ ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే
1)యూత్ హెల్ప్ సెంటర్:- యువతకు ఉపాధి కల్పించడం సర్వారం గ్రామ ప్రజల యొక్క అవసరాల మేరకు మండల కార్యాలయం చుట్టూ తిరగకుండా గ్రామపంచాయతీలోనే ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేసి అన్ని రకాల అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ చేసి పరిష్కరించడం జరుగుతుంది. దీని గాను ఒక యువతకు ఉద్యోగం కల్పించి నెలకు కనీస వేతనం 10000 ఇవ్వడం జరుగుతుంది.
2) గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్గాల వారికి సమాన న్యాయ పాలన అందించడం జరుగుతుంది.
3) ప్రతి నెల గ్రామంలో చేసిన ఖర్చు లెక్కలు గ్రామసభ ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.
4) గ్రామ యువతకు మరియు గ్రామ ప్రజలకు స్టేడియం మరియు వాకింగ్ చేయడానికి స్థలం కేటాయించడం జరుగుతుంది.
5) గ్రామ రైతులకు యూరియా కొరత లేకుండా సకాలంలో అందజేయడం జరుగుతుంది.
6) గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్గాల వారికి కుటుంబంలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి భరోసాగా 5000 రూపాయలు, 25 కేజీల బియ్యం అదే రోజు ఇవ్వడం జరుగుతుంది.
7) గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్గాల వారికి కుటుంబంలో అమ్మాయి పెళ్లి కానుకగా పదివేల రూపాయలు, పట్టుచీర ఇవ్వడం జరుగుతుంది.
8) గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్గాల వారికి కుటుంబంలో ఆడపిల్ల జన్మిస్తే ఆ కుటుంబానికి 5 వేల రూపాయల హాస్పటల్ ఖర్చు ఇవ్వడం జరుగుతుంది.
9) గ్రామంలో ప్రతినెల ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది.
గ్రామ అభివృద్ధియే నా ధ్యేయంగా అవినీతి రహిత పాలనయే నా లక్ష్యంగా పెట్టుకొని మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.