calender_icon.png 12 December, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిమ్ముల గోవర్ధన్‌ రెడ్డికి ఆటో యూనియన్ ఘన సన్మానం

12-12-2025 09:55:56 PM

గుమ్మడిదల: బీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌ రెడ్డికి గుమ్మడిదల మండల ఆటో యూనియన్‌ సభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానం చేశారు. మండలంలోని గ్రామ పంచాయతీలలో విస్తృతంగా పర్యటిస్తూ  ప్రచారం నిర్వహించిన గోవర్ధన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రచార శైలి గ్రామాల స్థాయిలో పార్టీ బలాన్ని పెంచిందని యూనియన్‌ సభ్యులు ప్రశంసించారు.

గుమ్మడిదల మున్సిపల్‌ కేంద్రంలో ఆటో యూనియన్‌ అధ్యక్షుడు శివకుమార్‌ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు  గోవర్ధన్‌ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ విజయానికి ఆయన చేసిన కృషి గుమ్మడిదల రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, సూర్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, వీర, అశ్వక్, శ్రీకాంత్, నాగేష్, దయాకర్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.