12-12-2025 10:34:43 PM
ఉప్పల్‌లో పెరుగుతున్న మ్యూజిక్ కల్చర్
ఉప్పల్,(విజయక్రాంతి): బార్లపేట నృత్యాలు అర్ధరాత్రి వరకు మ్యూజిక్ లు అనుమతి ఉండదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. లా అండ్ ఆర్డర్ పోలీసుల తిప్పలు ఆపై తగాదాలు గొడవలు నిత్యము పోలీస్ స్టేషన్లో జరిగే సంఘటనలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్లలో లైవ్ మ్యూజిక్ పెట్టి అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. స్థానిక ఉండే అపార్ట్మెంట్ వాసులు అధిక సౌండ్ పెట్టండి ఇబ్బందులు పడుతున్నానని ఆరోపణ విలువెత్తుతున్నాయి.
బార్లు లైవ్ మ్యూజిక్ ఏంటంటే ప్రశ్నిస్తే బార్ యజమాన్యాలు తేలికగా తీసుకొని తమ పని సాగిస్తున్నారు. వ్యాపారం ముఖ్యంగా వ్యవహరిస్తూ స్థానికులు ఇబ్బంది కూడా చేస్తున్నారు తాజాగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు మూడు బార్లు లైఫ్ మ్యూజిక్ పేరిట శుక్ర శని ఆదివారాలు ఇష్టానుసారంగా సౌండ్ పెట్టి స్థానిక ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవటం ఆరోపణలు వస్తున్నాయి. అర్ధరాత్రి వరకు మ్యూజిక్ తో స్థానికంగా ఉండే బార్లపై చర్యలు తీసుకోవాలని మలరు కోరుతున్నారు