calender_icon.png 13 December, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాలభైరవ జయంతి వేడుకలు

12-12-2025 10:54:45 PM

చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలం పార్ పల్లి గ్రామంలోని కాలభైరవ జయంతి వేడుకలు శుక్ర వారం ఘనంగా నిర్వహించారు. భైరవ జయంతిని పురస్కరించుకొని భక్తులు భైరవ కొండకు ఉదయం నుంచే ఆలయానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన కాల భైరవునికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. భక్తుల తాకిడితో అటవీ ప్రాంతమంతా భైరవ నామ స్మరణతో మారుమోగింది.

ఈ భైరవ జయంతి ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. మాజీ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే స్వయంభుగ వెలసిన కాలభైరవ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.