calender_icon.png 13 December, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారెంటీలు అమలు చేయని సీఎంపై మాజీ మంత్రి వినూత్న నిరసన

12-12-2025 10:49:20 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆరు గ్యారెంటీల అమలుకై మొద్దు నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేల్కొనేలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం చేపట్టారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బాగంగా శుక్రవారం జైనథ్ మండలంలో ప్రచారం చేపట్టారు. ముందుగా లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మొద్దు నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి నీ నిద్రలో నుండి మోల్కొనేల మాజీ మంత్రి స్వయంగా డప్పు కొడుతూ డప్పు చాటింపు వేస్తూ ఆరు పథకాలపై దండోరా వేస్తూ ప్రచారంలో నిలదీశారు. ఈ సందర్భంగా జోగు రామన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలను మోసగించేలా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. పంచాయితీ తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ కు  ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, బిఆర్‌ఎస్ కు పలుచోట్ల పట్టాం కట్టారని గుర్తు చేశారు.

 పట్టాం కట్టారని గుర్తు. రెండవ, మూడో విడుదల సైతం బి ఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  ఇంజనీరింగ్ కాలేజ్, బిఎస్సి అగ్రికల్చర్ కాలేజ్, రైతు సమస్యలపై ఆదిలాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తో   ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించకపోవడం  జిల్లా అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.