calender_icon.png 17 July, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటివారున్నా శిక్ష పడాల్సిందే

17-06-2025 02:06:11 PM

  1. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చిన  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 
  2. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తల హడావిడి.
  3. ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గు పడాలి.
  4. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగే కారణం
  5. ప్రభుత్వాధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తలొగ్గారు.
  6. రిటైరైన వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టారు.
  7. ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య.
  8. ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి.
  9. ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) కేసులో సాక్షిగా సిట్ విచారణకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) మంగళవారం హాజరయ్యారు. సిట్ సూచన మేరకు జూబ్లీహిల్స్ ఏసీబీ ఎదుట మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ మహేష్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేసినట్లు అనుమానంతో సీఎస్ కు ఫిర్యాదు చేశామని మహేష్ కుమార్ వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియా సమావేశంలో చెప్పారు. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. రాజకీయనాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడిన కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), కేటీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే ఉండాలనే దురుద్దేశంతో మా ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన పేర్కొన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగే కారణమని తెలుస్తోందన్నారు. సుమారు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ జరిగిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ విచారణలో తేలిందన్నారు. ప్రభుత్వాధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి తలొగ్గారని వెల్లడించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా రిటైరైన వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్(Intelligence Chief) నియమించారని మండిపడ్డారు. రిటైరైన ప్రభాకర్ రావును గత ప్రభుత్వం ఐజీ చీఫ్ గా నియమించిదన్నారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్ లబ్ధి పొందిందన్నారు. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా అధికారులు, నేతలకు శిక్ష పడాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటివారున్న శిక్ష పడాల్సిందేనన్న ఆయన.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను సుప్రీం కోర్టు తీవ్రంగా శిక్షించాల్సిందేనని కోరారు. రాజకీయ నేతలు, జడ్జిలు, అధికారుల ఫోన్లనూ ట్యాప్ చేశారని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో ఓడిపోయిందని చెప్పారు. నక్సల్స్ తో సంబంధం ఉందనే అసత్య ఆరోపణలతో మా ఫోన్లు ట్యాప్ చేశారని పీసీసీ చీఫ్ వివరించారు.