2 May, 2026 | 1:53 AM

లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

02-05-2026 12:00 AM

పట్టు వస్త్రాలు సమర్పించిన వెంకటరమణారెడ్డి 

కామారెడ్డి, మే 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. వేద పండితులు  మంత్రోచ్ఛారణలతో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

స్వామి వారికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణోత్సవంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు, పూజార్లు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు.