సమాజ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకం
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి, మే 1 (విజయక్రాంతి): సమాజ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి కలెక్టరేట్లో మే డే ఉత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాల్గొని కార్మిక దినోత్సవ అవార్డులను అందజేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో ప్రయాణం ప్రతిరంగంలో పురోగతికి కార్మికులే పునాది అని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.
కార్మికులతో మాకులతో పాటు నిధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ పరిశ్రమగా బీసీ స్లాబరు ట్రీస్ ఎంపిక కాగా ఉత్తమ ఉద్యోగులుగా కార్మిక శాఖకు చెందిన సయ్యద్ కామ్రుద్దీన్, ఉపాధి కల్పన శాఖ కు చెందిన కృప, తాడువాయి ఏ టి సి రమేష్ కు పురస్కారాలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్, సిడిపి చైర్మన్ ఇర్షాద్ ,సహాయ కార్మిక శాఖ కమిషనర్ మున్నం శశి కుమార్, తదితరులు పాల్గొన్నారు.






