calender_icon.png 25 May, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేకరీలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు

21-05-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, మే 20 (విజయక్రాంతి): ఫంగస్ వచ్చిన బ్రెడ్ విక్రయిస్తున్నారనే ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణంలోని ఓ ప్రముఖ బేకరీ షాపులో మంగళవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తనిఖీలు నిర్వహించారు. కోటగిరి మోహన్ అనే వ్యక్తి సోమవారం యావర్ రోడ్ లోని బేకరీ షాపులో పావు బజ్జి బ్రెడ్ ను కొనుగోలు చేశారు.

ఇంటికి వెళ్లి చూసేసరికి అందులో ఫంగస్ వ చ్చిన బ్రెడ్ ఉండడంతో షాక్ కు గురైన మోహన్ బేకరీ యజమానిని ప్రశ్నించాడు. అయితే అత ను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మోహన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ఆశ్రయించారు. మోహన్ ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష షాపులోని పలు బేకరీ ఐటమ్ ఐ టమ్స్ శాంపిళ్లను సేకరించారు. బ్రెడ్ కు సంబంధించిన ఆహార పదార్థాల ఎక్స్పైరీ డేట్  మూ డు రోజులు మాత్రమే ఉండాలని షాపు యజమానిని ఆదేశించారు. శాంపిల్ల నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తెలిపారు.