calender_icon.png 10 September, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులు మంజూరు చేయాలని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను కోరిన ఎమ్మెల్యే

10-09-2025 12:34:29 AM

జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 9(విజయ క్రాంతి): ఎస్సీ ఎస్టీ మైనార్టీ నివాస ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.

మంగళవారం హైదరాబాదులోని మంత్రి చాంబర్లో కలిసిన ఎమ్మెల్యేజ గిత్యాల నియోజకవర్గ పరిధిలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనకబడిన ప్రజలు నివాస ప్రాంతాల అభివృద్ధి, రోడ్లు, సంఘ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,

ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాల కు,ఎస్సీ, ఎస్టీ తాండాల పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు.సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మంజూరుకు కృషి చేస్తాననిహామీఇచ్చారు.